calender_icon.png 23 February, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపూర్ణ కేంద్రాలు ఆధునీకరణకు చర్యలు

22-02-2025 11:06:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి):  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహిస్తున్న రూ. 5 లకే భోజన వసతి కేంద్రాలను ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు ప్రత్యేక కమిటీ హెడ్, చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. నగరంలోని అన్నపూర్ణ కేంద్రాల వద్ద కనీస వసతుల పరిశీలన, భోజనం తదితర అంశాలను పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ నియామకం చేసిన ప్రత్యేక కమిటీ బృందం శనివారం సెక్రటేరియట్ వెనుకా భాగంలో నున్న మింట్ కాంపౌండ్, లక్డికపూల్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ హెడ్ సీఈ భాస్కర్ రెడ్డి, హెల్త్ విభాగం అడిషనల్ కమిష నర్ పంకజ, సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజలు అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనం చేసి, కనీస వసతులతో పాటు భోజన పరిమాణం, నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. సీఈ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్నపూర్ణ కేంద్రాలు నిరుపేదలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ కేంద్రాల వద్ద కనీస వసతులతో పాటు పౌష్టికాహారం అందించేందుకు జీహెచ్‌ఎంసీ చర్య లు తీసుకుంటున్నట్టు తెలిపారు. భోజనం చేసిన అనంతరం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మింట్ కాంపౌండ్, లక్డీకపూల్ ప్రదేశాలలోని అన్న పూర్ణ క్యాంటీన్ కేంద్రాలను మరమ్మతులు చేయాలని కమిటీ నిర్ణయించినట్టుగా తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో క్యాంటీ న్ల స్థితిని నివేదించడానికి ఇంజినీర్ల బృందాన్ని నియమిస్తున్నట్టు తెలిపారు.