calender_icon.png 4 December, 2024 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు

03-12-2024 11:03:41 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా భారతి విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఇంటి నుండి చెత్తను తప్పనిసరిగా సేకరించాలని, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినందున సమస్యలను సమన్వయంతో పని చేసి పరిష్కరించాలని, పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ప్రతిరోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైనదని, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, గృహాల యజమానులు చెత్తను తప్పనిసరిగా చెత్త బండిలో వేయాలని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించుకుని వైద్య సేవలు పొందాలని తెలిపారు.

ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో మహిళ సంఘాలకు 1 కోటి 20 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగిందని తెలిపారు. ఇంతకుముందు ఆసిఫాబాద్ పట్టణంలో పారిశుధ్యం పై చేపట్టిన అవగాహన ర్యాలీలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి బస్టాండ్ ఏరియాలో గల కామ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పారిశుద్ధ్య ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతిరాం, బ్యాంకు మేనేజర్, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.