17-03-2025 06:00:55 PM
కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): డివిజన్ లో వీధిలైట్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం డివిజన్లో ఏర్పాటు చేస్తున్న వీధి దీపాలను ఆమె అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఐమాక్స్ లైట్ల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... డివిజన్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విధి దీపాలు వెలగడం లేదని, పలు కాలనీలు బస్తీల్లో రాత్రిళ్ళు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న స్థానికుల ఫిర్యాదు మేరకు డివిజన్ లో నెలకొన్న సమస్య తీవ్రతను అధికారులకు వివరించి, గత వారం రోజులుగా దాదాపు 50 కి పైగా నూతన స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ముందుగా సమస్య తీవ్రంగా వున్నచోట స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు దేశమని, మరికొన్ని చోట్ల డార్క్ స్పాట్స్ ను గుర్తించి వెంటనే లైట్ లు ఏర్పాటు చేయిస్తున్నామని కార్పొరేటర్ తెలిపారు. స్ట్రీట్ లైట్స్ తో పాటు అవసరమున్న చోట ఐమాక్స్ లైట్ లను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఐమాక్స్ లైట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, బీజేపీ నేతలు, ఆకుల సురేందర్, జ్ఞానేశ్వర్, అరుణ్ కుమార్, ప్రశాంత్, స్ట్రీట్ లైట్స్ సర్కిల్ డిప్యూటీ ఇంజనీర్ అశోక్ కుమార్, సిబ్బంది బాలు నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.