కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నెహ్రు నగర్, గోపినగర్ లో పర్యటన
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి డివిజన్ లో గల నెహ్రూ నగర్, గోపినగర్ లలో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఎలక్ట్రికల్, జలమండలి, జిహెచ్ఎంసి, అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. అనంతరం స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపి నగర్, నెహ్రూ నగర్ లలో సీసీ రోడ్లు దాదాపుగా పూర్తయినట్టే మిగిలిన చోట్ల ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సీసీ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తానని అన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను తొలగించి క్రమపద్ధతిగా ఏర్పాటు చేసి, కరెంట్ తీగలను, ఇండ్లపై వేలాడకుండా సరైన విధంగా సమకూర్చాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్ సెక్షన్, ఎలక్ట్రికల్, ఆయా విభాగాల అధికారులు స్థానికులు పాల్గొన్నారు.