05-04-2025 12:00:00 AM
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిరిసిల్ల, ఏప్రిల్ 04:(విజయక్రాంతి)/జగిత్యాల అర్బన్: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్, జగిత్యాల కలెక్టరేట్‌లలోని సమావేశ మందిరాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మి నారాయణలతో కలిసి సమీక్ష సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలో 4 వేల 313 ఎకరాలకు సంబంధించి 6029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1614 మంది రైతులకు 2860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఎఫ్.ఐ.ఆర్ నమోదైన కేసులో 116 మందికి, చార్జి షిట్ దశలో 57 మందికి మొత్తం కోటి 28 లక్షల 87 వేల 500 రూపాయల పరిహారం చెల్లించడం జరిగిందని, మిగిలిన 194 బాధితులకు చెల్లించాల్సిన కోటి 45 లక్షల 30 వేల రూపాయలు త్వరగా మంజూరు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.
. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తి గా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ అఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలన్నారు ఎస్ సి, ఎస్ టి లకి సంబదించిన భూములపై కేస్‌లు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ చట్టం పై అధికారులు ప్రజలకి అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రతినెల చివరి రోజున ఖచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలని, హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఐ ల ద్వారా నిర్వహిస్తున్నారని అలా చేయకుండా తహసీల్దార్, ఎస్ ఐ లు పౌరహక్కుల దినోత్సవం కి హాజరు అయి ప్రజలకు చట్టం పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం అమలు కు కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని తూ.చ తప్పకుండ పాటించాలని కోరారు. సిరిసిల్లలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్, వేములవాడ ఏ.ఎస్పీ. శేషాద్రిని రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా భాయి, డి.ఎస్పీ.
చంద్ర శేఖర్ రెడ్డి,జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డివో లు మధు సుధన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ , జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, డి.ఏ.సి.పిలు రఘు చందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.