calender_icon.png 24 February, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

19-02-2025 12:00:00 AM

  1. నేరాలకు పాల్పడేవారిపై నిఘా పెట్టాలి 
  2. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి
  3. నర్సాపూర్, శివంపేట పోలీస్ స్టేషన్ల తనిఖీ

నర్సాపూర్(మెదక్), ఫిబ్రవరి 18: జిల్లాలోని నర్సాపూర్, శివంపేట్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మంగళవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు.  అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్  స్టేషన్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిసి కెమెరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్లో తీవ్రమైన నేరాల సి.డి ఫైల్స్, స్థిరాస్థి చోరీలు, ఐటీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోగల నేర ప్రవృత్తి కల వారిని ప్రతి రోజు తనిఖీ చేయాలని, అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని, పోలీస్ స్టేషన్ల పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియామాలు పాటించాలని తాగి వాహనాలు నడపవద్దని అన్నారు.  ఎస్పీ వెంట తూప్రాన్ సీఐ  రంగా కృష్ణ, నర్సాపూర్ ఎస్‌ఐ లింగం, శివంపేట్ ఎస్‌ఐ మధుకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.