04-03-2025 08:46:23 PM
ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ మంగళవారం ఆయన జెమినీ కాలనీ, దయారా మార్కెట్, మనెమ్మ గల్లి, సాగర్లాల్ హాస్పిటల్ రోడ్ లో అధికారులతో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెమినీ కాలనీ వాసులు కలుషిత నీటి సరఫరా జరుగుతుందని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వీధి దీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. అదే విధంగా దయారా మార్కెట్లో రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారని, దుమ్మి దూళి సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడానికి వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా మణమ్మ గల్లీలో డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పడి కోసం వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి DE లు సన్నీ, గీత, వాటర్ వర్క్స్ డీజిఎం మోహన్ రాజ్, జిఎం శివ సాయి, బిఆర్ఎస్ నాయకులు ముఠా జై సింహా, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, రాజా దీన్ దయాల్ రెడ్డి, అరుణ్ కుమార్, డేవిడ్ రాజ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, కడప సురేందర్, నేత శ్రీనివాస్, మహమ్మద్ ఖదీర్, సురేందర్, ధర్మేందర్, సత్యనారాయణ బాబు, పూస గోరఖ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.