పిట్లం ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో వసంత పంచమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఆక్షరాభ్యాస కార్యక్రమం చిన్నారులతో వారి తల్లిదండ్రులు కలిసి నిర్వహించారు. సుమారు 50 మంది చిన్నారులు ఈ సంప్ర దాయ విద్యారంభోత్సవంలో పాల్గొని, జ్ఞానదేవత సరస్వతికి ప్రార్థనలు అర్పిం చారు.
పురోహితులు ఆనంద్ పంతులు ‘ఓం నమః శివాయ‘, ‘శ్రీ సిద్ధం నమః‘ మంత్రోచ్చారణతో చిన్నారులకు మొదటి పాఠం నేర్పించడం దర్శనీయంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణం విద్యా సాంస్కృతిక వాతావరణంతో ఉల్లాసంతో నిండిపోయింది. కార్యక్రమంలో కోట రాజులు, ఉడుగుల రాము (ప్రధానా చార్యులు), భద్రయ్య, మాతాజీలు ప్రము ఖంగా పాల్గొన్నారు.