calender_icon.png 19 March, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సత్యం బాబు ప్రత్యేక ఇంట్రవ్యూ..

19-03-2025 05:53:02 PM

కల్లూరు (విజయక్రాంతి): ఏనుగు సత్యం బాబు ప్రత్యక్ష రాజకీయం ప్రస్థానం 2011 లో మొదలైంది. తుమ్మల, పొంగులేటి, మట్టాల ముఖ్య అనుచరుడుగా మంచి గుర్తింపు పొందిన మండల సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందారు. 2012లో వైయస్సార్.సీ.పీ పార్టీ మండల అధ్యక్షులుగా అవకాశం కలిపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపిగా పోటీ చెయ్యగా గెలుపొందారు. సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మట్టా దయానంద్ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మండలంలో వారి గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన అనుచరుడిగా మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుండి మట్టా దయానంద్ తో పరిచయం ఏర్పడింది.

అప్పటి నుండి ప్రస్తుతం మట్టా దయానంద్, నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అనుచరుడుగా మంచి గుర్తింపుతో ప్రయాణం ముందుకు సాగుతుంది. నాకు రాజకీయ పదవులతో పనిలేదు పదవులు శాస్వితం కాదు గ్రామం అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి పనులు పది కాలాలు ప్రజల్లో గుర్తు ఉండేలా చేస్తాయని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మట్టా దంపతులు ఆదర్ణ ఉన్నది. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మట్టా దయానంద్ ప్రోత్సహాంతో లింగాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చెపట్టి పూర్తి చేసాము. రాబోయే రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ల సహకారంతో మంచి అభివృద్ధి పనులు చేస్తామని ఏనుగు సత్యం బాబు తెలిపారు.