21-02-2025 07:06:01 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు(MLC Election Vote) ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) ఈనెల 27న ప్రత్యేక సెలవు ప్రకటించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల విషయంలో సీఈవో సూచనలు చేసింది. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని, షిఫ్టుల సర్దుబాటు, ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలని సీఈవో కోరారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా వరంగల్-ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.