calender_icon.png 7 March, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారం గ్రామంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం

06-03-2025 10:08:01 PM

పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం ఎల్లారం గ్రామంలో గురువారం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ మండల వైద్యాధికారి డా. ఉమాకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఆరోగ్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఉమాకాంత్ మాట్లాడుతూ.. పౌష్టిక ఆహారం తీసుకోవాలని మందులు సక్రమంగా వాడాలని సూచించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, LT, ఫార్మసిస్ట్, ఆశాలు పాల్గొన్నారు.