25-02-2025 08:11:59 PM
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈనెల 27న జరిగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాట్లు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక సాధారణ సెలవు, వెసులుబాట్లను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.