calender_icon.png 22 December, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

13-09-2024 05:36:49 PM

 కలెక్టర్ ఆదర్శ్ సురభి

 వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలోని  సంక్షేమ వసతి గృహాలు, గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల అధికారులు, ఆర్సీఒలు, డీసీఒ లు, వైద్య శాఖ అధికారులు, ఆర్బీఎస్. కె.ప్రిన్సిపాల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  వర్షాలు తగ్గాయని, సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున వచ్చే రెండు నెలల వరకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.  పాఠశాల పరిసర ప్రాంతాలలో నిలువ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాలలో పని చేసే వంట మనిషి ఇతర సిబ్బందికి ఖచ్చితంగా వైడల్ పరీక్షలు నిర్వహించాలని, వారి ద్వారా పిల్లలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ఆర్.బి.ఎస్.కే ద్వారా వసతి గృహాలు, గురుకులాలు, కే.జి.బి.లో విద్యార్థినులకు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేస్తునుండాలని, రక్త హీనత బాధపడే విద్యార్థినిలను గుర్తించి మందులు ఇవ్వాలని వాటిని తినిపించే బాధ్యతలు ఉపాద్యాయులు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకు మందులు ఇచ్చిన వాటిని తీనకుండ పడేస్తారని, అందువల్ల తినిపించే  బాధ్యతలు ఉపాద్యాయులకు అప్పగించాలన్నారు.

వసతి గృహాలకు వచ్చే సరుకు విద్యార్థుల మెస్ కమిటీ ద్వారా సంతకాలు తీసుకోవాలని సూచించారు. ఆహారపు సరుకు వచ్చిన ప్రతిసారి స్టాక్  రిజిస్టర్ లో విద్యార్థుల సంతకం ఉండాలని,  వస్తువుల కాలపరిమితిని తప్పకుండా పరిశీలించాలని సూచించారు.  విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.డి. ఈ. ఒ గోవిందరాజులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జయచంద్ర మోహన్, ఆర్డీఓ పద్మావతి, ఎస్సి సంక్షేమ శాఖ అధికారి నుషిత, ఆర్.సి. ఒ లు, డి.సి. ఒ లు, వసతి గృహాల ప్రిన్సిపాల్ , తదితరులు పాల్గొన్నారు.