* నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): నగర సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని హఫీజ్‌పేట్‌లో ఆమె ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు.
పలు వార్డులో సమస్యలు తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కారం చూపే జోనల్‌లోని ఆయా విభాగాల ఉన్నతాధికారులు, సంబంధిత కార్పొరేటర్లతో కలిసి శానిటేషన్, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, కాలనీలలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
హఫీజ్‌పేట్‌లోని పలు కాలనీల్లో శానిటేషన్ సమస్య, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నలగండ్ల చెరువులో సీ అండ్ వేస్ట్ తొలగిం పునకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే రాంకీ ప్రతినిధులతో మాట్లాడి వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు.
గ్రేటర్‌లో సుందరీకరణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా పంజాగుట్ట సర్కిల్ వద్ద పాదయాత్ర చేస్తున్న సందర్భంగా స్ట్రీట్ పోల్ తగిలి కింద మేయర్ విజయలక్ష్మీ కిందపడ్డారు. దీంతో ఆమెకు స్వల గాయాలయ్యాయి.