11-03-2025 05:33:52 PM
భైంసా (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని దొడర్న నుండి మహారాష్ట్ర బోర్డర్ వాసి వరకు 7కోట్ల 68 లక్షల రూపాయల ఎస్టీ ఎస్ డి ఎఫ్ నిధులతో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. తండా 3,4 ,5 లను అనుసంధానంగా ఏడున్నర కిలోమీటర్ల రోడ్డు ఉంటుందన్నారు. రోడ్లు బాగుపడితేనే అభివృద్ధి జరుగుతుందని, గ్రామస్తులు చెప్పిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు.
దొడర్న చెరువు, రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు చెప్పారు. తరచూ ఎన్నికల కోడ్ వస్తున్న మూలంగా అభివృద్ధికి ఆటంకం కలిగిన మాట వాస్తవమేనన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లు బొయిడి విఠల్, నగేష్, నాయకులు రాథోడ్ శంకర్, సంవ్లీ రమేష్, పైడిపెల్లి గంగాధర్, బిజెపి మండల అధ్యక్షులు యేశాల దత్తాత్రితో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.x