డిప్యూటీ కమిషనర్ పీ దశరథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్సుజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పీ దశరథ్ పేర్కొన్నారు. గురువారం నాంపల్లిలోని ఎక్సుజ్ కార్యాలయంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సుజ్ అధికారులతో డివిజన్ పురోగతిపై ఆయన సమీక్షించారు. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఐదు ఎక్సుజ్ సూపరిండెంట్ల పరిధిలో ఉన్న ఫంక్షన్స్ హాల్స్, ఫామ్‌హౌజ్‌లలో జరిగే విందుల్లో రాష్ట్ర మద్యం వినియోగించేలా చర్యలు చేపట్టాలని నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు.