calender_icon.png 20 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ డ్రైవింగ్2025పై ప్రత్యేక దృష్టి

11-04-2025 12:08:03 AM

ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు 

ఖమ్మం, ఏప్రిల్ 10 ( విజయక్రాంతి ):-మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థుల వేసవి సెలవులు దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు నగరంలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు.

ఇటీవల కాలంలో రోడ్డు  ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీలో ర్యాష్ డ్రైవింగ్ అదేవిధంగా మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ పట్టుబడ్డుతున్నారని తెలిపారు.

కొందరు యువకులు ద్విచక్ర వాహనాలకు కంపెనీ సైలెన్సర్లను మార్పుచేసి అధిక శబ్దం వచ్చే వాటిని అమర్చుతూ..పాదచారులను భయభ్రంతులు కలిగేలా రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా లైసెన్సు, నంబర్ ప్లేట్ నంబర్ సక్రమంగా లేని, నంబర్ ట్యాంపారింగ్ కలిగిన, నంబర్ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను కోరారు.