calender_icon.png 6 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

06-02-2025 12:29:07 AM

రంగారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి ): జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి పై  ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం జిల్లా గ్రంథాలయ కార్యాలయావరణలో పాలకవర్గ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో 2024- 25 ఏడాదికి సంబంధించి చేసిన ఖర్చులను ఆమోదిం చారు. జిల్లాలో నూతన భవనాల నిర్మాణాల ఖర్చు అంచనా రూ. 10 కోట్లు కేటాయించాలని... మొయినాబాద్, కడతాల, అబ్దుల్లాపూర్మెట్, గండిపేట్‌లో నూతన భవనాలను నిర్మించాలని,

దాంతోపాటు  నూతన పుస్తకాల కొనుగోలు కోసం రూ. 50 లక్షలు,  నూతన ఫర్నిచర్ కోసం రూ.50 లక్షలు, గ్రంథాలయ వారోసాల కోసం  రూ. ఐదు లక్షలు పాలకవర్గ సభ్యులందరూ తీర్మానించారు.

సమావేశంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి పూర్ణచంద్రరావు, పౌర సంబంధాల అధికారి వెంకటేశం, జిల్లా వయోజన విద్యాధికారి  అనిత, ఎంపీ ఓ  సాధన, జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ లు పాల్గొన్నారు.