calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి

16-04-2025 12:00:00 AM

కలెక్టర్ రాజర్షి షా

పింకిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు సానిటరీ పాడ్స్ పంపిణీ 

ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : బాలికలు ఋతు క్రమానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్య సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కౌమార దశలో బాలికలకు మొదలయ్యే ఋతు చక్రం, స్వీయ పరిశుభ్రత గురించిన అవగాహన, సానిటరీ పాడ్స్ పంపిణీ కార్యక్ర మంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంగళవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని బాలికలకు పింకిష్ పౌండేషన్ అధినేత అనిల్ గుప్తా, సెక్రటరీ శాలిని గుప్తాతో కలిసి బాలికలకు సానిటరీ పాడ్స్ లను పంపిణీ చేశారు.

తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 33 ఉన్న త పాఠశాలలో, ఏడు కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలకు రెండు నెలలకు సరిప డా ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్ల చొప్పున సానిటరీ పాడ్స్ ఉచితంగా సప్లై చేస్తున్నాట్లు తెలి పారు. ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తామన్నారు.  అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లను ఆశా వర్కర్లను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడు తూ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి మహిళకు నారీ సమ్మాన్ పేరిట ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ఈ వేసవిలో ఋతు చక్రంపై అవగాహన, అపోహల నిర్మూలనపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రక్తహీనత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రుతుచక్రంపై అవగాహన కలిగి, ఎలాంటి అపోహలు లేక తమత మ గౌరవాన్ని పెంచుకొని స్వీయ పరిశుభ్రత తో భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం రాకుండా తమను తాము కాపాడుకోవాలని అందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గణేష్ జాదవ్, విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి నరేందర్ రాథోడ్, జిల్లా మహిళా శిశు సంక్షేమా శాఖ అధికారిణి మిల్కా, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సాధన, డాక్టర్ శ్రీధర్, నీతి ఆయోగ్ రాహుల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.