calender_icon.png 26 February, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

26-02-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్

దౌల్తాబాద్, పిబ్రవరి 25: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని శేరిపల్లి బందారం మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల కళాశాలను సందర్శించారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షలపై పలు సూచనలు చేశారు. పదవ తరగతిలో వందశాతం సాధించే విధంగా విద్యార్థిలను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు.

పాఠశాల తరగతి గదుల నిర్వహణ, వంట సామాగ్రి, భోజన వసతుల ఏర్పాటు, నీటి సరఫరాను పరిశీలించారు. భోజనంలో గుడ్లు, క్యారెట్, బీట్రూట్, వంటివి తప్పనిసరిగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్రవంతి, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, తహసిల్దార్ చంద్రశేఖర రావు, మండల విద్యాధికారి కనకరాజు, ఏపీవో రాజు, పిఆర్‌ఏఈ రాం కుమార్ పాల్గొన్నారు.