calender_icon.png 5 February, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి

05-02-2025 07:29:00 PM

ఎస్పీ డివి శ్రీనివాస్ రావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఎస్పి డివి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్రీత్ అనలైజర్స్ లను పోలీసు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని వాటిని నివారించేందుకు బ్రీత్ అనలైజర్స్ ఎంతో ఉపయోగపడితే అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో మద్యం తాగి వాహనాలు నడిపే సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, జిల్లాలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు.