calender_icon.png 22 January, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

21-01-2025 05:20:12 PM

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(MLA Palwai Harish Babu) అన్నారు. మంగళవారం దయగం మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ఉపాధి హామీ ద్వారా మంజూరైన పనులను ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపుగా రూ.67 లక్షలతో అంగన్వాడి, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంతో పాటు రహదారుల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి పెద్దపీడ వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్, సురేష్, మల్లేష్, సంజీవ్, రవితేజ, శంకర్ గౌడ్, వినోద్, శ్రీను, గణపతి, శ్రీధర్, లక్ష్మణ్, బొజ్జు, కేదారి, భీమేష్, చందు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.