ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, భూసమస్యలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.. ఎస్సీ, ఎస్టీ కేసులపై నిర్లక్ష్యం చేస్తే కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతీ మూడు నెలలకోసారి సమావేశాలు, ప్రతీ నెల సివిల్ రైట్స్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అట్రాసిటీ కేసుల నష్టపరిహారం రూ.2.48 కోట్ల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,216కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
నాలుగు నెలల్లోగా వాటిని పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, డీసీపీ శ్వేత, కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, జిల్లా కురుసం, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి.రాంప్రసాద్, బీ ఎల్లేశ్, డి.సుదర్శన్‌బాబు, ఇటిక గోపి, బీ వెంకటేశ్వర్‌రావు, ఎన్జీవో పులి కల్పన, డీఆర్‌వో వెంకటాచారి పాల్గొన్నారు.