calender_icon.png 30 March, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 5 వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్

22-03-2025 12:48:34 AM

జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

పెద్దపల్లి, మార్చి21(విజయక్రాంతి) : జిల్లాలో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి రెవెన్యూ సమస్యల పరిష్కారం పై అదనపు కలెక్టర్ డి.వేణు, ఆర్డీవోలు, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా  కలెక్టర్   మాట్లాడుతూ మండలాలలో ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  ఎల్.ఆర్.యూ.పి  కార్యక్రమంలో జరిగిన పొరపాట్ల సవరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రజావాణి లో జిల్లా మండల స్థాయిలలో మనకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, భూ వివాదాలపై ఉన్న కోర్ట్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ భూ సమస్యలపై మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రత్యేక నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, కోర్టు కేసులు, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, ప్రభుత్వ భూముల సంరక్షణ, ఎల్.ఆర్.యూ.పి సవరణ వంటి పనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు సురేష్ , బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరిండెంట్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.