calender_icon.png 23 February, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడ్ లైసెన్స్‌లపై స్పెషల్ డ్రైవ్

19-02-2025 01:16:25 AM

వనపర్తి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ల కొరకై ఫిబ్రవరి 19వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నవారు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారి కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రూట్ల వారీగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా  మున్సిపాలిటీ సిబ్బంది దుకాణాల వద్దకు వచ్చినప్పుడు వ్యాపారులు సహకరించి ట్రేడ్ లైసెన్స్ సేవలను పొంద వచ్చని అదనపు కలెక్టర్ తెలిపారు.