25-02-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : లైసెన్సులు లేని వారికి రవాణా శాఖ అధికారులతో సమన్వయం పాటిస్తూ, లైసెన్సులు తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, డిఎస్పీ రెహమాన్ సూచనల తో సోమవారం నుండి కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే సోమవారం లైసెన్సులు లేకుండా ఆటోలను నడుపుతున్న రామవరం, సూపర్ బజార్, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ అడ్డా లకు చెందిన 05గురు డ్రైవర్లకు జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో లెర్నింగ్ లైసెన్స్ లను ఇప్పించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి అరతలు కలిగి ఉండి లైసెన్సులు తీసుకోకుండా వాహనాలు నడిపే వారిపై ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.