calender_icon.png 29 September, 2024 | 2:56 AM

తాగునీటి సమస్యలపై స్పెషల్ డ్రైవ్

28-09-2024 12:06:49 AM

  1. గాంధీ జయంతి నుంచి 90రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
  2. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(విజయక్రాంతి) : గ్రేటర్‌లోని సివరేజీ సమస్య, వేసవిలో నీటి ఇబ్బందులపై జలమండలి దృష్టి సారించింది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జలమండలి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భం గా జలమండలి పరిధిలో 90రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయ న వెల్లడించారు. మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన ఇసుక, మట్టిమేటలను డీసిల్ట్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నామని, అలాగే డ్యామేజ్ అయిన పైప్‌లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు.

వేసవిలో వాటర్ ట్యాం కర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూ గర్భ జలాలను పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ లో ఇంకుడు గుంతలను నిర్మించనున్నామని జీఎం మొదలు ఉన్నతాధికారులు, ఉర్యగులు, సిబ్బం ది అంతా స్పెషల్ డ్రైవ్‌లో భాగస్వాములవుతారని అశోక్‌రెడ్డి తెలిపారు. ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్‌సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఇంకుడు గుం తల ప్రత్యేకాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.