calender_icon.png 10 March, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో నెంబర్ ప్లేట్ లేని, త్రిబుల్ రైడింగ్ బైక్స్ పై స్పెషల్ డ్రైవ్

09-03-2025 07:56:17 PM

మంథని ఎస్ఐ డేగ రమేష్...

మంథని (విజయక్రాంతి): మంథనిలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు, త్రిబుల్ రైడింగ్ బైక్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. ఆదివారం మంథని పట్టణంలో సిఐ రాజు ఆదేశాల మేరకు ఎస్ఐ ఆధ్వర్యంలో మంథని సిఐ రాజు ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, త్రిబుల్ రైడింగ్ బైక్స్, అనుమతులేని అధిక శబ్దం వచ్చు సైలెన్సర్లు లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మంథని పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మంథని మండల పరిధిలో డ్రైవర్లకు లైసెన్స్ లేకుండా మరియు త్రిబుల్ రైడింగ్ చేసిన నెంబర్ ప్లేట్ లేకున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఆ వహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి జరిమానా విధించారు. అనంతరం వారి వాహనాలను విడుదల అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.