200 మంది మందుబాబులపై కేసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్‌లోని పోలీస్స్టేషన్ల పరిధిలో శనివారం ఒక్క రోజే నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 200 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఇందులో 153 మంది ద్విచక్రవాహనదారులు ఉండగా 11 మంది ఆటో డ్రైవర్లు, 31 కారు డ్రైవర్లు, 5 హెవీ వెహికిల్ డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారందరినీ సోమవారం కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.