calender_icon.png 25 February, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

19-02-2025 12:00:00 AM

పటాన్ చెరు, ఫిబ్రవరి 18 : బొల్లారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లకు మున్సిపల్ అధికారులు స్పెషల్ చేపట్టారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్యాక్స్ కలెక్షన్స్ బృందాలు పరిశ్రమ యాజమాన్యాలు, గృహ యజమానుల నుంచి ఆస్తి పన్ను వసూలు చేశారు. ఆగ్రోటెక్స్ కోటింగ్ ప్రొడకట్స్ లిమిటెడ్ పరిశ్రమ యజమాని బి రాజు  రూ.1,47, 7 51, సంభీమ్ స్పెషాలిటీ యజమాని వై శ్రీధర్ రూ.2, 15, 300 ఆస్తి పన్నును చెక్కుల రూపంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. బొల్లారం మున్సిపాలిటీలోని మిగతా పరిశ్రమలు, గృహ యాజమానులు సకాలంలో ఆస్తి పనులు చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున స్వామి, ఆర్వో నర్సింలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.