calender_icon.png 11 February, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్నుల వసూల్‌కు ప్రత్యేక డ్రైవ్

11-02-2025 01:07:05 AM

కామారెడ్డి మున్సిపల్ రెవెన్యూ అధికారి గోపాల్‌రెడ్డి

కామారెడ్డి ,ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి), కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డుల్లో ఇంటి పన్ను వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ రెవిన్యూ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం విజయ క్రాంతి తో మాట్లాడారు. ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసర్ తో పాటు బిల్ కలెక్టర్లు మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి బిల్లుల వసూల్ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరో నెల 20 రోజుల గడువులో 100% ఇంటి పన్ను వసూలు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇంటి పన్ను తో పాటు కులాయి పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించి ఇంటి పన్నులు కులాయి పన్నులు చెల్లించాలని గోపాల్ రెడ్డి కోరారు. కామారెడ్డి పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు సహకరించాలని పన్నులు సకాలంలో చెల్లించాలని కోరారు.