calender_icon.png 20 March, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి బల్దియా అధికారుల స్పెషల్ డ్రైవ్

20-03-2025 12:00:00 AM

  1. మరో 12 రోజులే గడువు
  2. ఇంటి పన్నులు, కులాయి పన్నుల వసూలు పై సిబ్బందికి టార్గెట్
  3. 100% పన్ను వసూలు చేయడమే లక్ష్యం
  4. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మున్సిపాలిటీలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి) :  కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీలో అధికారులు ఇంటి పన్నులు కులాయి పన్నుల వసూలు పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం పాలకవర్గం ఉండడంతో వారి ఒత్తిళ్లకు అధికారులు తలోగ్గే వారు. ప్రస్తుతం మునిసిపాలిటీలలో పాలకవర్గ సభ్యులు లేకపోవడంతో మున్సిపల్ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో మున్సిపల్ పాలన కొనసాగుతుంది.

దీంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పేరుకపోయిన ఇంటి, కులాయి పన్ను బకాయిల పై దృష్టి పెట్టి ప్రత్యేక అధికారులను కేటాయించారు. వార్డ్ అధికారులతో పాటు బిల్ కలెక్టర్లు మున్సిపల్ సిబ్బందిని టీం గా ఏర్పాటుచేసి వార్డుల వారిగా నియమించి పన్నుల వసూలుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు.

ప్రతి బృందానికి టార్గెట్ ఇచ్చి వసూళ్ల కోసం ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ బృందాలు వసూలు చేస్తున్న పనులపై మున్సిపల్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు రెవిన్యూ అధికారి ప్రత్యేక శ్రద్ధ చూపుతో పేరుక పోయిన  ఇంటి పన్నులు కులాయి పనులు మున్సిపల్ కు రావలసిన షాపింగ్ అద్దెలు 100% వసూలు చేయాలని సంకల్పం పెట్టుకున్నారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ మున్సిపల్ కమిషనర్లతో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. 2024 -25 వార్షిక సంవత్సరం 31 మార్చి వరకు ఉండడంతో పన్నుల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక బృందాలతో సమావేశాలు నిర్వహించి కలెక్షన్ వసూలు ఎందుకు వసూలు కావడం లేదని విషయాలపై మున్సిపల్ అధికారులు వార్డ్ అధికారులతో బిల్ కలెక్టర్లతో కలిసి సమావేశాలు నిత్యము నిర్వహిస్తూ పన్నుల వసూళ్లపై ప్రత్యేక కృషి చేస్తున్నారు.

ఇంటి పన్నులు కులాయి పన్నులు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు పేరుకపోవడంతో ఎలాగైనా వసూలు చేసి కామారెడ్డి పట్టణ అభివృద్ధి పనులకు వెచ్చించాలనే ఉద్దేశంతో అధికారులు కంకణం కట్టుకున్నారు. గత సంవత్సరం వరకు పాలకవర్గం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఉండడంతో అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టిన వారిపై ఒత్తిడి తెచ్చి పన్నులు వసూళ్లకు మోకాళ్లు వడ్డారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో పన్ను వసూలు పగడ్బందీగా మునిసిపల్ సిబ్బంది అధికారులు చేపడుతున్నారు. బకాయి ఉన్న ఇంటి యజమానులకు ఫోన్ ద్వారా ఇంటికి వెళ్లి సమాచారము అందించడం ఎప్పటి వరకు చెల్లిస్తారు అనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటి యజమానులు చెప్పిన సమయానికి గుర్తు చేస్తూ ఇంటి పన్నులు కులాయి పన్నులు మున్సిపల్ షాపింగ్ అద్దె బాకాయలు వసూళ్లు చేస్తున్నారు.

గత ఏడాది కంటే 100% శాతం పన్ను వసూలు చేసి కలెక్టర్ ద్వారా శభాష్ అనిపించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బకాయి పడిన ఇంటి యజమానులు పన్నులు చెల్లించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని ప్రత్యేకంగా మైక్ సెట్ పెట్టి ప్రతి కాలనీలో వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

పన్నులు చెల్లించండి పట్టణ అభివృద్ధికి సహకరించండి అంటూ ప్రచారాన్ని ఒకవైపు చేపడుతూ మరోవైపు వార్డు అధికారులతో కలిసి ఒక టీముగా ఏర్పడి ఇంటి పన్నులు కులాయి పన్నులు వసూళ్లు చేపడుతున్నారు.

100% పన్నులు వసూలు చేయడమే లక్ష్యం

కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నులు కులాయి పన్నులు షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు 100% వసూలు చేయాలనే లక్ష్యంతో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజా గోపాల్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వార్డు అది కారులతో పాటు బిల్ కలెక్టర్లు మున్సిపల్ సిబ్బంది నీ బృందాలుగా ఏర్పాటు చేసి పన్నుల వసూలు చేపడుతున్నాం. మాజీ ప్రజా ప్రతినిధులు ఇంటి యజమానులు పన్నులు చెల్లించి మునిసిపల్ కు ఆదాయం పెంచేలా సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు కామారెడ్డి పట్టణ ప్రజలు సహకరిస్తున్నారు.

 రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి.