సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చిన అల్లుడికి
130 రకాల తెలంగాణ వంటకాలతో విందు
ఎల్బీనగర్,(విజయక్రాంతి): ఆంధ్రా అల్లుడికి తెలంగాణ ఆతిథ్యం అబ్బురపరిచింది. సంక్రాంతి పండగకు హైదరాబాద్ వచ్చిన ఓ ఆంధ్రా అల్లుడికి అత్తింటివారు ఏకంగా 130 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. సరూర్ నగర్ ప్రాంతంలోని శారదానగర్‌లో నివాసముంటున్న కాంత్రి, కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మ్లలికార్జున్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి తొలిసారి కొత్త అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా తెలంగాణ వంటకాలతో పసందైన విందుతో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. పిండి వంటలతోపాటు మొత్తం 130 రకాల వంటలు వడ్డించి, అత్తింటి మర్యాదలు చేశారు. పిండి వంటలతోపాటు మాంసాహారం, శాఖాహారం, పులిహోరా, బగారా తదితర 130 రకాల వంటలు వడ్డించారు. అల్లుడికి చేసిన విందు చూసి, ఎంతటి వైభోగం అంటూ ఆశ్చర్యపోయారు.