07-04-2025 11:52:49 AM
అన్యమయ్య: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా(Annamayya District)లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రెండు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(Handriniva Special Deputy Collector) రమ(50) దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే రాయచోటి ఆస్పత్రికి తరలించారు. రాయచోటి ఆస్పత్రిలో బాధితులను కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. గాయపడిన వారు కోలుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.