calender_icon.png 13 January, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా కుంభమేళాపై స్పందించిన ప్రధాని మోదీ

13-01-2025 12:58:37 PM

న్యూఢిల్లీ: మహా కుంభమేళా(Mahakumbh 2025)కు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర్ ప్రదేశ్  ప్రయాగ్ రాజ్(Uttar Pradesh Prayagraj) లో 45 రోజుల పాటు భక్తజనం కోలాహలంగా మారనుంది. భూమండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా. పుష్య పౌర్ణమి(Pushya Pournami) సందర్భంగా తొలి షాహీస్నాన్ లో లక్షల మంది భక్తులు పాల్గొనున్నారు. భక్తులు, స్వాధీలు, సాధవులు దేశవిదేశాల నుంచి తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం(UP Government) భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మహా కుంభమేళాపై(Mahakumbh) ఎక్స్ వేధికగా ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) స్పందించారు. పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం మహా కుంభ్ ప్రారంభమై నందున, భారతీయ విలువలు సంస్కృతిని గౌరవించే వారికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని నరేంద్ర మోడీ అభివర్ణించారు  విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒక చోట చేర్చిందని పేర్కొన్నారు. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తోందని ప్రధాని సూచించారు. పవిత్ర స్నానాలకు లెక్కకు మిక్కిలి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.