calender_icon.png 18 April, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల పునరావాసానికి ప్రత్యేక కమిటీలు

11-04-2025 10:58:08 AM

చత్తీస్గడ్ హోంశాఖ ఏర్పరిచిన ప్రత్యేక విధి విధానాలు

జిల్లా కలెక్టర్ కమిటీ చైర్మన్ గా

లొంగిపోయిన, గాయపడ్డ మావోయిస్టు వివరాలతో ప్రత్యేక పోర్టల్

డివిజన్ స్థాయిలలో ప్రత్యేక నోడల్ ఆఫీసర్ విధులు

చర్ల , (విజయ క్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్  ప్రభుత్వం(Chhattisgarh Government) అధికారికంగా మావోయిస్టులు లొంగిపోయే బాధితుల ఉపశమన పునరావాస విధానం -2025 ను అమలు లోకి తెచ్చింది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఒక ప్రత్యేక  వసతులు కల్పిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి  28న హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. మావోయిస్టులు పోలీసుల కాల్పులలో గాయపడిన వారికి, కుటుంబాల పునరావాసం, ఉపశమనం కోసం ఈ విధానం తయారు చేయబడింది. మరణం, తీవ్రంగా గాయపడిన , శాశ్వత వైకల్యం, లొంగిపోయిన మావోయిస్టులకు ఈ విధానాలు వర్తిస్తాయి.

పునరావాస కమిటీని జిల్లా స్థాయిలో ఏర్పాటు

ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం  ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయవలసిన కమిటీ కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు, పోలీసు సూపరింటెండెంట్‌కు కార్యదర్శి బాధ్యత ఉంటుంది. ఇదే కాకుండా, మరో ఇద్దరు అధికారులు, సాయుధ దళాల ప్రతినిధులు కూడా కమిటీలో విధులు నిర్వహిస్తారు.

ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తారు

ప్రతి జిల్లా , ఉప-డివిజనల్ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా రాష్ట్ర ప్రభుత్వానికి పంపబడుతుంది. ఈ అధికారులు అన్ని పునరావాస పనులను పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో జరిగిన అన్ని బాధిత కేసులను గుర్తించాలని , లొంగిపోయిన  మావోయిస్టుల  వారి ఉపశమనం , పునరావాసం వంటి విషయాలను ప్రాధాన్యతనిచ్చేటప్పుడు హోం శాఖ సూచనలు చేసే విధంగా ఈ విధానం రూపొందించారు.

ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయబడుతుంది

ఈ విధానం ప్రకారం ఒక ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయబడుతోంది, ఆన్లైన్ విధానం ద్వారా దీనిలో ప్రతి బాధితుడు , లొంగిపోయిన వ్యక్తి యొక్క సమాచారం రికార్డ్ చేయబడుతుంది. వారికి ప్రత్యేకమైన ఐడి అందించబడుతుంది. సంబంధిత అధికారులు ఈ పోర్టల్ యొక్క డాష్‌బోర్డ్‌ను క్రమం తప్పకుండా గమనించాల్సి ఉంటుంది, ఈ పోర్టల్ ద్వారానే  ఉపశమనం , పునరావాస పనుల అమలును నిర్ధారిస్తారు. ఈ విధానం ప్రకారం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి, వారు సమయ పరిమితిలో ఉపశమనం , పునరావాస చర్యలను సమర్థవంతంగా పూర్తి చేయాలని చతిస్గడ్  హోం శాఖ కలెక్టర్లను ఆదేశించింది.  దీంతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో జీవించేందుకు సానుకూల పరిస్థితులను ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాటు చేస్తుంది.