04-03-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్, మార్చి 3 (విజయక్రాంతి) : ఔట్ సోర్సింగ్ బదులు ఉద్యోగులకు సంబంధించి నలుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించినట్లు కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం రోజు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశుధ్య విభాగంలో... బదు లు ఉద్యోగుల కోసం కమీషనర్‌కు ఆర్జీలు సమర్పించుకున్న అంశంపై కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.
నగరపాలక సంస్థ గుర్తించిన మొత్తం 67 మంది బదులు వర్కర్లలో కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్‌కి ఆర్జి సమర్పిం చుకుంటు పలు దరఖాస్తులు రావడం జరిగింది. వచ్చిన దరఖాస్తులకు సంబందించి మూడు కెటగిరిలలో కమిటీ వెరిఫికేషన్ చేసి సరైన రిపోర్టును సమర్పించాలి. జౌట్‌సోర్సింగ్ బదులు వర్కర్ల దరఖా స్తులకు సంబందించి కమీషనర్ చాహాత్ బాజ్‌పాయ్ సభ్యులతో చర్చించి... సలహాల తో ఆదేశాలు జారీ చేశారు.