హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో నూతన అక్రిడిటే షన్ నియమ, నిబంధనలు రూపకల్ప న కోసం మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రెండో సమావేశం నిర్వహించింది. బుధవారం మాసబ్ ట్యాంక్‌లో ని సమాచార భవన్లో నిర్వహించిన సమావేశంలో సమాచారశాఖ కమిష నర్ ఎస్ హరీశ్, సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్, ఉమర్ అలీఖాన్, రవికాంత్‌రెడ్డి, ఫొటో జర్నలిస్టు హరి, సమాచారశాఖ ఇన్చార్జి డైరెక్టర్ జగన్ పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు.