calender_icon.png 1 March, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అష్టలక్ష్మి సహిత విశేష చండీ హోమం

01-03-2025 01:32:28 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : నస్పూర్ లో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ కాలచక్రం, శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీ భగవద్గీత 86వ విశ్వశాంతి మహా యాగం మహోత్సవం లో శుక్రవారం అష్టలక్ష్మి సహిత విశేష చండీ హోమం నిర్వహించారు.

కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాగంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన దశ సహస్ర, పదివేల రజత కమలములతో పుష్పార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణులు జరిపారు. ఈ చండీ హోమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్ దంపతులు, అధిక సంఖ్యలో భక్త జంటలు పాల్గొన్నాయి.