calender_icon.png 6 January, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుబాబులకు ప్రత్యేక క్యాబ్

01-01-2025 01:38:42 AM

* రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన 

* అమలు చేసిన నోయిడా పోలీసులు

లక్నో, డిసెంబర్ 31: కొత్త సంవత్సర ఆరంభ వేళ రోడ్డు ప్రమాదాల నివారణకు నోయిడా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. డిసెంబర్ 31 (మంగళవారం) రాత్రి వేడుకల్లో మద్యం తాగిన వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక క్యాబ్‌లు ఏర్పాటు చేశారు. అందుకు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాల సహకారం తీసుకున్నారు.

ప్రత్యేకంగా 3 వేల మంది సిబ్బందిని నియమించి సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా మధ్య క్యాబ్‌లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ మాట్లాడుతూ.. మద్యం తాగిన వారిని వారికి ఇంటికి చేర్చేందుకు బైక్, కారు ట్యాక్సీలను వినియోగించామన్నారు.

బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేశామన్నారు. నగర పరిధిలోని మూడు సూపర్ జోన్లు, పది సాధారణ జోన్లు, 27 సెక్టార్లు, 119 సబ్ సెక్టార్లలో రోడ్డు ప్రమాదాలను నివారించామని పేర్కొన్నారు.