24-02-2025 12:24:27 AM
నిర్మల్ ,ఫిబ్రవరి 23( విజయ క్రాంతి) : మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని నిర్మల్ డిపో నుండి వేములవాడకు ఈనెల 25 నుంచి 27 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు బియ్యం ప్రతిమారెడ్డి తెలిపారు. మొత్తం 30 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని పెద్దలకు 270 పిల్లలకు 140 బస్సు చార్జి ఉంటుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు. గ్రామాల నుండి నేరుగా వేములవాడకు వెళ్లే వారికి వారు కోరుకున్న ప్రదేశానికి బస్సులను పంపడం జరుగుతుందని డిఎం తెలిపారు.