భీమదేవరపల్లి, జనవరి 5: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఈ నెల 10 నుంచి 18 వరకు జరిగే వీరభద్రుడు బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌక ర్యార్థం ఐదు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు. సమీపంలోని హుస్నాబాద్, హుజూ రాబాద్, వరంగల్, కరీంనగర్, గోదావరిఖని డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు కొత్తకొండ వీరభద్రు డి ఆలయానికి రాకపోకలు సాగించ నున్నాయి.
ఈ బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ వీ రవీంద్రనాథ్ సూచించా రు. ఈ మేరకు కొత్తకొండలో తాత్కా లిక బస్టాండ్ ఏర్పాటు చేసేందుకు ఆదివారం డిపో మేనేజర్ రవీంద్ర నాథ్ స్థల పరిశీలన చేశారు. కాగా డీఎంతోపాటు ఆర్టీసీ సిబ్బందికి కొత్తకొండ వీరభద్రుడి జాతర ఆహ్వా నపత్రికను ఆలయ అర్చకులు మొగి లిపాలెం రాంబాబు అందజేశారు.