హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సంద ర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరమేశ్వరుని దర్శనానికి అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితోపాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతు న్నట్టు వివరించారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు ప్రత్యేక బస్సులు అరుణా చలానికి చేరుకుంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని www.tgs rtcbus.inలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040 040 నంబర్లలో సంప్రదించాలని ఎండీ కోరారు.