గిరి ప్రదర్శనలు చేసే వారికి శుభవార్త
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం (అన్నామలై) గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా, ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతుందని వెల్లడించింది. అరుణాచలం ప్యాకేజీలో కాణిపాక వర సిద్ధి వినాయకస్వామితోపాటు శ్రీపు రం (వెల్లూరు) గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించినట్టు ఆర్టీసీ తెలిపింది. ఈ ప్యాకేజీ కోసం tgsrtconline.in ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది.