calender_icon.png 25 February, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

24-02-2025 08:33:01 PM

ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జోత్స్న...

నిజామాబాద్ (విజయక్రాంతి): మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 25, 26, 27 తేదీలలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్ నుండి వేములవాడ వరకు 17 బస్సులు ఆర్మూర్ నుండి వేములవాడ వరకు 100 బస్సులు కామారెడ్డి నుండి వేములవాడ వరకు 19 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జోత్స్న తెలిపారు. బస్సు చార్జీలు నిజామాబాద్ నుండి వేములవాడకు పెద్దలకి 270 రూపాయలు, పిల్లలకి 150 రూపాయలు ఆర్మూర్ నుండి వేములవాడకు పెద్దలకి 220 రూపాయలు, పిల్లలకి ఒక 120 కామారెడ్డి నుండి వేములవాడకి పెద్దలకి ఒక వంద 40 పిల్లలకి 80 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని ఆమె తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలోని లంక రామలింగేశ్వర ఆలయానికి మద్దికుంట బుగ్గ లింగేశ్వర కొమురెల్లి మల్లన్న సన్నిధికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.