19-02-2025 01:36:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పురస్కరించుకొని రాష్ర్టంలోని శైవ క్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది.
గతేడాదితో పోలిస్తే ఈసారి శివరాత్రి పర్వది నాన భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వచ్చే అవకాశం ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధింత డీఎంలకు సూచిం చింది.