23-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి ): మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపనుంది.ఈ నెల 26న మహాశివరాత్రి కా గా, 24 నుంచి 28 మధ్య ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ధరలు పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రె స్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి- పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.