హైదరాబాద్,(విజయక్రాంతి): టీఎస్ ఆర్టీసీ కురుమూర్మి స్వామి భక్తులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 8వ తేదీ నుంచి కురుమూర్తి స్వామి జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండంతో కురుమూర్తి స్వామి జాతరకు హైదరాబాద్ నుంచి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జాతరకు ఈ నెల 7 నుంచి 9 వరకు ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్ నగర్ మీదుగా ప్రత్యేక బస్సులు వెళ్తాయి. ఈ ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. టికెట్లు బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ఈ స్పెషల్ బస్సుల్లో భక్తులు సరక్షితంగా ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకోగలరాని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా శుక్రవారం వెల్లడించారు.