calender_icon.png 13 February, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగాపూర్ జాతరకు ప్రత్యేక బస్సులు..

10-02-2025 05:25:02 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపో ఆధ్వర్యంలో గంగాపూర్ జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిఎం విశ్వనాథ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ నుండి 06 బస్సులు, కాగజ్ నగర్ నుండి గంగాపూర్ జాతరకు 06 బస్సులు, బెల్లంపల్లి నుండి గంగాపూర్ జాతరకు 06 బస్సులు మొత్తం 18 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నుండి గంగాపూర్ జాతర వరకు బస్సు చార్జి పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలు, కాగజ్ నగర్ నుండి గంగాపూర్ జాతర వరకు బస్సు చార్జి పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలు, బెల్లంపల్లి నుండి గంగాపూర్ జాతర వరకు బస్సు చార్జి పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలు జాతరకు వెళ్ళే ప్రతి మహిళకు మహాలక్ష్మి స్కీం వర్తిస్తుందని తెలిపారు. భక్త మహాశయులందరూ ఆర్టీసీ బస్సులలోనే సుఖవంతమైన ప్రయాణం చేయగలరని కోరారు.