calender_icon.png 13 February, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయాలకు ప్రత్యేక బస్ సర్వీసులు..

13-02-2025 06:06:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 25 26 తేదీల్లో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నిర్మల్ డిపో నుండి వివిధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం ప్రతిమారెడ్డి తెలిపారు. గురువారం నిర్మల్ డిపో అధికారులతో బస్సుల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. నిర్మల్ నుండి కదిలీ కాలువ పోచంపాడు బూరుగుపల్లి బాసర వేములవాడ తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని ఇందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజశేఖర్, మహేష్ కుమార్, డిపో సిబ్బంది పాల్గొన్నారు.